ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా 187వ బూత్ పరిధిలో నెల రోజుల పాటు ఇంటింటి సర్వే విజయవంతంగా పూర్తి చేశారు. ఓటర్ల వివరాలను సేకరించి ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించడం ద్వారా అప్పగించిన బాధ్యతను పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్వోలు, బూత్ ఇన్చార్జ్లు సమన్వయంతో పనిచేసి సర్వే ప్రక్రియను పూర్తిచేశారు.
సర్వే కార్యక్రమంలో పద్మశాలి డైరెక్టర్, క్లస్టర్ ఇన్చార్జ్ సింగం వెంకన్న, 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, డివిజన్ అధ్యక్షుడు పీవీఆర్, కార్యదర్శి అంగిరేకుల రాంబాబు, టీడీపీ సీనియర్ నాయకులు బర్మా శ్రీను, అడపా కోటేశ్వరరావు, బీవీ రాంబాబు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెగా రమణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అలాగే బీఎల్వో చైతన్య మౌళి, బూత్ ఇన్చార్జ్ దేవిరెడ్డి రాజా, కాయల సతీష్ తదితరులు సర్వే విజయవంతానికి సహకరించారు. కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news