.
తన్మయ్ అగర్వాల్, సాత్విక్ రెడ్డి ఆరంభం నుంచే దూకుడుగా ఆడి డైమండ్స్‌కు అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి తొలి నాలుగు ఓవర్లలో 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచారు. అయితే ఐదో ఓవర్లో తనయ్ జడ్డు కీలక వికెట్ తీసి ఈ జోడీని విడదీశాడు. అనంతరం తనయ్ త్యాగరాజన్ సాత్విక్ రెడ్డిని ఔట్ చేయడంతో రైజర్స్ జట్టుకు కొంతసేపు మ్యాచ్‌పై ఆధిపత్యం లభించింది
కానీ రాహుల్, హృషికేశ్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతూ డైమండ్స్‌ను విజయపథంలో నడిపించారు. వీరి కీలక భాగస్వామ్యంతో డైమండ్స్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి టోర్నీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
Fetching videos...
Fetching latest news...
No trending news