HomeInternationalడ్రగ్స్ ముఠా కేసు.. భారత సంతతి ముగ్గురికి 22 ఏళ్ల ..
డ్రగ్స్ ముఠా కేసు.. భారత సంతతి ముగ్గురికి 22 ఏళ్ల జైలు
Updated 2 days ago
బ్రిటన్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులకు మొత్తం 22 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధించారు. లండన్‌లోని మెట్రోపాలిటన్ పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో పశ్చిమ లండన్ కేంద్రంగా హెరాయిన్, క్రాక్ కొకైన్ అక్రమ రవాణా చేస్తున్న సంఘటిత ముఠా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టైన 59 ఏళ్ల పురుషోత్తమ్ ధిల్లన్ అప్పట్లో విధుల్లో ఉన్న మేజిస్ట్రేట్‌గా పనిచేస్తూ తన పదవిని నేర కార్యకలాపాలకు ఉపయోగించినట్లు కోర్టు గుర్తించింది. దీంతో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మరో నిందితుడు హర్దీప్ థింద్ (హ్యారీ సింగ్)కు 12 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష, బిక్రమ్‌జిత్ బ్రార్‌కు 3 సంవత్సరాల 4 నెలల జైలు శిక్ష విధించింది. ఈ ముగ్గురికి కలిపి 22 ఏళ్లకు పైగా కారాగార శిక్ష పడింది. సంఘటిత నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు.