వెనిజులాలో సంభవించిన భీకర భూకంపం ఒక కుటుంబ జీవితాన్ని క్షణాల్లో మార్చేసింది. భారీ ప్రకంపనలతో కూలిపోయిన అపార్ట్మెంట్ శిథిలాల కింద 12 ఏళ్ల బాలిక ఫాబియానా 32 గంటల పాటు చిక్కుకుపోయినా అసాధారణ ధైర్యంతో ప్రాణాలు నిలబెట్టుకుంది. శిథిలాల కింద ఉన్న సమయంలో తనకు దొరికిన కెచప్, చీజ్ తింటూ బతికానని ఆమె చెప్పిన మాటలు ప్రపంచవ్యాప్తంగా భావోద్వేగానికి గురిచేశాయి. సహాయక బృందాలు చివరకు ఆమెను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. జూన్ 24న వెనిజులాలో వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించాయి. రెండో భూకంపం రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో నమోదై గత వందేళ్లలో దేశాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన ప్రకంపనల్లో ఒకటిగా నిలిచింది. ఈ భూకంపాల ప్రభావంతో అనేక భవనాలు కూలిపోయాయి. ముఖ్యంగా ఉత్తర లా గ్వైరా రాష్ట్రంలోని కారబల్లెడా ప్రాంతంలో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. భూకంపం సంభవించిన సమయంలో ఫాబియానా తల్లి కరీనా బ్లాంకో తాను నిర్వహించే స్పిన్నింగ్ తరగతిని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. మొదట స్వల్ప ప్రకంపనలు వచ్చినప్పటికీ క్షణాల్లోనే అవి తీవ్రరూపం దాల్చాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఆమె వెంటనే బయటకు పరుగెత్తింది. అయితే వెంటనే తన కుమార్తె ఇంట్లో ఒంటరిగా ఉందనే విషయం గుర్తుకు రావడంతో తీవ్ర ఆందోళనకు గురైంది.
కరీనా వెంటనే కారులో ఇంటివైపు బయలుదేరింది. అక్కడికి చేరుకున్న తర్వాత కనిపించిన దృశ్యం ఆమెను షాక్కు గురిచేసింది. తాము నివసిస్తున్న పదంతస్తుల భవనం పూర్తిగా నేలమట్టమైపోయింది. ఒక వైపు మరో భవనం, మరో వైపు ఇంకో భవనం కనిపిస్తుండగా మధ్యలో తమ భవనం ఉన్న చోట భారీ శిథిలాల గుట్ట మాత్రమే కనిపించింది. ఆ దృశ్యం చూసి తన కుమార్తె పరిస్థితి ఏమైందో తెలియక ఆమె తీవ్ర ఆవేదనకు గురైంది
Fetching videos...
Fetching latest news...
No trending news