తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తక్కలై సమీపంలో ఉన్న పద్మనాభపురం ప్యాలెస్ భారతదేశ చారిత్రక సంపదలో ఒక అపూర్వ రత్నంగా నిలుస్తోంది. దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రాజభవనం పూర్తిగా చెక్కతో నిర్మించబడిన దేశంలోనే అతిపెద్ద ప్యాలెస్‌గా గుర్తింపు పొందింది. భౌగోళికంగా తమిళనాడులో ఉన్నప్పటికీ, ఈ చారిత్రక కట్టడాన్ని కేరళ పురావస్తు శాఖ నిర్వహిస్తోంది. ట్రావన్‌కోర్ రాజవంశానికి తొలి రాజధానిగా వెలుగొందిన ఈ ప్యాలెస్ కేరళ సంప్రదాయ వాస్తుశిల్పానికి అద్దం పడుతుంది. అద్భుతమైన చెక్క శిల్పాలు, రాజసభలు, పురాతన గదులు, రహస్య సొరంగాలు, ప్రత్యేక నిర్మాణ శైలి సందర్శకులను శతాబ్దాల వెనక్కి తీసుకెళ్తాయి. మహారాజా మార్తాండ వర్మ కాలంలో ఈ ప్రాంతానికి ‘పద్మనాభపురం’ అనే పేరు స్థిరపడింది. చరిత్ర, వాస్తుశిల్పం, రాజరిక వైభవం ఒకేచోట చూడాలనుకునే వారికి ఈ ప్యాలెస్ తప్పక సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశంగా నిలుస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news