థాయ్‌లాండ్‌లోని పట్టాయా నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే పట్టాల సమీపంలో పడేసిన సూట్‌కేస్‌లో పదిహేడేళ్ల బాలిక తున్చనోక్ డోన్హోమ్లా మృతదేహం లభించడంతో పోలీసులు ఆస్ట్రేలియాకు చెందిన సైమన్ పీటర్ పోలీసుల వివరాల ప్రకారం, బాలిక శుక్రవారం సాయంత్రం కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు నమోదైంది. అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, గురువారం తెల్లవారుజామున కార్మన్ బాలికతో కలిసి ఒక కండోమినియంలోకి వెళ్లినట్లు కనిపించింది. అదే రోజు రాత్రి అతడు ఒంటరిగా పెద్ద సూట్‌కేస్ మోసుకుంటూ బయటకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఆ సూట్‌కేస్‌ను మోటార్‌సైకిల్‌పై ఎక్కించి రైల్వే లైన్ వైపు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో గుర్తించారు. శనివారం తెల్లవారుజామున రైల్వే పట్టాల సమీపంలో సూట్‌కేస్‌ను గుర్తించిన పోలీసులు, అందులో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం బ్యాంకాక్ సువర్ణభూమి విమానాశ్రయంలో దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కార్మన్ను అదుపులోకి తీసుకున్నారు.
కార్మన్ను అరెస్ట్ చేశారు. అతడిపై హత్య కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.Fetching videos...
Fetching latest news...
No trending news