వాట్సాప్ వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూజర్‌నేమ్ ఫీచర్‌ను మెటా అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఇకపై ఫోన్ నంబర్‌ను పంచుకోకుండానే యూనిక్ యూజర్‌నేమ్ ఆధారంగా ఇతరులతో కనెక్ట్ కావచ్చు. దీంతో వ్యక్తిగత గోప్యత మరింత మెరుగుపడటంతో పాటు స్పామ్ మెసేజ్‌లు, అనవసర సంప్రదింపుల నుంచి రక్షణ లభించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ‘ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్’ విధానంలో దశలవారీగా విడుదల చేస్తున్నారు.
యూజర్లు Settings > Account > Username విభాగంలోకి వెళ్లి తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. యూజర్‌నేమ్ 3 నుంచి 35 అక్షరాల మధ్య ఉండాలి. కనీసం ఒక అక్షరం తప్పనిసరిగా ఉండాలి. కేవలం సంఖ్యలు లేదా ప్రత్యేక గుర్తులతో యూజర్‌నేమ్ సృష్టించేందుకు అనుమతి ఉండదు. అండర్స్కోర్లు, చుక్కలు, చిన్న అక్షరాలను ఉపయోగించవచ్చు.
ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టనున్నప్పటికీ, ప్రస్తుతం యూజర్‌నేమ్ రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అదనంగా “యూజర్‌నేమ్ కీ” అనే భద్రతా ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకొస్తోంది. దీని ద్వారా అపరిచితులు మీ యూజర్‌నేమ్ తెలిసినా నేరుగా చాట్ ప్రారంభించలేరు. ప్రైవసీ, డేటా భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ కొత్త ఫీచర్ ప్రధాన లక్ష్యమని వాట్సాప్ వెల్లడించింది.
Fetching videos...
Fetching latest news...
No trending news