బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద జరిగిన కాల్పుల కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో న్యాయమైన విచారణ, న్యాయం కోసం తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని కోర్టుకు తెలియజేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అనంతరం దర్యాప్తు సంస్థలు విస్తృత విచారణ చేపట్టి పలువురిని అరెస్టు చేశాయి. ఈ కేసులో అన్మోల్ బిష్ణోయ్ పేరు కూడా ప్రధానంగా వినిపించింది. దర్యాప్తు సంస్థలు అతడిని కుట్రలో కీలక పాత్రధారిగా భావిస్తున్నాయి
Fetching videos...
Fetching latest news...
No trending news