బ్రిటన్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రిఫార్మ్ యూకే (Reform UK) పార్టీ నాయకుడు నైజెల్ ఫరాజ్ తన క్లాక్టన్ (Clacton) పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి మళ్లీ ప్రజల తీర్పు కోరనున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో, ప్రధాన రాజకీయ పార్టీలు ఆ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ, రిస్టోర్ బ్రిటన్ పార్టీలు క్లాక్టన్ ఉపఎన్నికలో తమ అభ్యర్థులను నిలబెట్టబోమని ప్రకటించడంతో ఈ ఎన్నిక బ్రిటన్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
నైజెల్ ఫరాజ్ తనపై పెరుగుతున్న ఆర్థిక వ్యవహారాల పరిశీలన, పార్లమెంటరీ ప్రమాణాల విచారణ నేపథ్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం అదే నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేస్తానని వెల్లడించారు. తన చర్యలపై తుది తీర్పు ప్రజలదేనని, క్లాక్టన్ ఓటర్లు తనను మళ్లీ ఎన్నుకోవాలా వద్దా నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికను "ప్రజలు వర్సెస్ వ్యవస్థ"గా ఆయన అభివర్ణించడం విశేషం.
అయితే ప్రతిపక్షాలు ఫరాజ్ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించాయి. బ్రిటన్ విదేశాంగ మంత్రి య్వెట్ కూపర్ ఈ ఉపఎన్నిక అసలు అవసరం లేనిదని వ్యాఖ్యానించారు. తనపై కొనసాగుతున్న విచారణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫరాజ్ ఈ రాజకీయ నాటకానికి తెరలేపారని ఆరోపించారు. ప్రతి ఒక్కరికి వర్తించే నియమాల నుంచి తప్పించుకోవడానికి ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news