అమరావతి వేదికగా దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని క్వూబిట్ ఫోర్స్ డైరెక్టర్ వెంకట్ సుబ్రమణ్యన్, ఎస్ఆర్ఎం వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సతీష్ కుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. విద్యార్థులు, పరిశోధకులు తమ ప్రయోగాలు, ఆవిష్కరణల కోసం ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరు.
అమరావతి క్వాంటం వ్యాలీలో బయోసెన్సార్స్, లేజర్ అప్లికేషన్స్ వంటి ఆధునిక సాంకేతిక సేవలు అందించేందుకు పలు సంస్థలు సిద్ధమవుతున్నాయి. జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ఎన్క్వ్యూఎం డైరెక్టర్ జేబీవీ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 15 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోగా, విజయవాడ మేధా టవర్స్‌లో 7 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి.
ఈ అభివృద్ధి రాష్ట్ర సాంకేతిక రంగానికి కొత్త దిశను చూపనుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
Fetching videos...
Fetching latest news...
No trending news