ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త విజన్‌ను ప్రకటించారు. గతంలో బ్యాండ్‌విడ్త్ వంటి మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో వినూత్న విధానాలతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. ఐటీతో పాటు ఫార్మా రంగానికి ప్రాధాన్యం ఇచ్చి ఏర్పాటు చేసిన జీనోమ్ వ్యాలీ ద్వారా కరోనా సమయంలో వంద దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయగలిగామని గుర్తుచేశారు.
ప్రస్తుతం రాష్ట్రం గ్రీన్, క్లీన్ ఎనర్జీ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. మైక్రో గ్రిడ్స్ ద్వారా విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు డేటా సెంటర్లకు గ్రీన్ ఎనర్జీ అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
అలాగే స్పేస్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మెడ్ టెక్ జోన్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రాన్ని సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news