అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయ గ్రంథాలయం నుంచి 17వ శతాబ్దానికి చెందిన అరుదైన చైనా సాహిత్య గ్రంథాలను అత్యంత పథకం ప్రకారం దొంగిలించిన కేసులో కాలిఫోర్నియాకు చెందిన జెఫ్రీ యింగ్‌కు కోర్టు శిక్ష విధించింది. నకిలీ పేర్లతో లైబ్రరీ కార్డులు పొందడం, అసలు గ్రంథాల స్థానంలో నకిలీ ప్రతులను తయారు చేసి తిరిగి అప్పగించడం వంటి పద్ధతులను అనుసరించినట్లు విచారణలో తేలింది. ఈ ఘటన అరుదైన చారిత్రక గ్రంథాల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్ (యూసీఎల్ఏ) గ్రంథాలయంలో ప్రపంచవ్యాప్తంగా అరుదైన పుస్తకాలు, చారిత్రక పత్రాలు, విలువైన కళాఖండాల విస్తృత సేకరణ ఉంది. పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఈ గ్రంథాలయం ముఖ్యమైన కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచే జెఫ్రీ యింగ్ విలువైన చైనా పురాతన గ్రంథాలను అద్దెకు తీసుకుని, వాటి స్థానంలో నకిలీ ప్రతులను తిరిగి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.దర్యాప్తు ప్రకారం, యింగ్ ఈ నేరాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా అమలు చేశాడు. అసలు గుర్తింపును దాచిపెట్టేందుకు జాసన్ వాంగ్, అలన్ ఫుజిమోరి, ఆస్టిన్ చెన్ వంటి నకిలీ పేర్లతో లైబ్రరీ సభ్యత్వాలను వినియోగించాడు. ఈ పేర్లతో అరుదైన గ్రంథాలను తీసుకున్నట్లు రికార్డులు చూపించాయి. అనంతరం విచారణలో ఆ పేర్లన్నీ జెఫ్రీ యింగ్కే సంబంధించినవని అధికారులు గుర్తించారు.
గ్రంథాలయంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, ఆ అరుదైన గ్రంథాలను తీసుకెళ్లిన వ్యక్తి ఒకరేనని స్పష్టమైంది. ఈ ఆధారాలతో అధికారులు అనుమానితుడిని గుర్తించి, యూసీఎల్ఏ సమీపంలోని హోటల్లో అతడిని గుర్తించారు. అక్కడ నిర్వహించిన సోదాల్లో అనేక ఖాళీ పురాతన మాన్యుస్క్రిప్ట్‌లు, పాత గ్రంథాల మాదిరిగా కనిపించే కాగితాలు, నకిలీ పుస్తకాలను తయారు చేయడానికి ఉపయోగించే సామగ్రి లభించినట్లు అధికారులు వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news