యూరప్ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచే నిర్ణయంలో భాగంగా, 118 సంవత్సరాలుగా అమల్లో ఉన్న స్పెయిన్–జిబ్రాల్టర్ సరిహద్దు నియంత్రణలు తొలగించబడనున్నాయి. జూలై 15 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుండటంతో స్పెయిన్, జిబ్రాల్టర్ మధ్య ప్రజల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. దశాబ్దాలుగా సరిహద్దు వద్ద ఎదురవుతున్న తనిఖీలు, క్యూలు, ఆలస్యాలకు ముగింపు పలుకుతూ ఈ నిర్ణయం కొత్త శకానికి నాంది పలుకుతుందని ఇరు ప్రాంతాల ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ ఉద్యోగాల కోసం సరిహద్దు దాటే వేలాది మంది కార్మికులకు ఇది భారీ ఊరటగా మారనుంది. జిబ్రాల్టర్ బ్రిటన్‌కు చెందిన ఓవర్సీస్ టెరిటరీ. సుమారు 40 వేల మంది జనాభా ఉన్న ఈ చిన్న ప్రాంతం స్పెయిన్ దక్షిణ తీరంలో, ఐరోపా ఖండానికి చివరి అంచున ఉంది. ఒకవైపు అట్లాంటిక్ మహాసముద్రం, మరోవైపు మధ్యధరా సముద్రం కలిసే ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ భూభాగం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. మొరాకోకు కేవలం తొమ్మిది మైళ్ల దూరంలో ఉండటం వల్ల కూడా దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.1321">సుమారు 15 వేల మంది స్పెయిన్ కార్మికులు ఉద్యోగాల కోసం జిబ్రాల్టర్కు వస్తుంటారు. ఈ సమయంలో సరిహద్దు వద్ద పొడవైన క్యూలు ఏర్పడి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కొత్త నిర్ణయంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
స్పెయిన్‌లోని లా లీనియా డే లా కాన్సెప్సియన్ పట్టణానికి చెందిన శిల్పి చోత్రానీ కూడా ప్రతిరోజూ సైకిల్‌పై జిబ్రాల్టర్కు ఉద్యోగానికి వెళ్తారు. ఆమె అభిప్రాయం ప్రకారం, రెండు ప్రాంతాల ప్రజల మధ్య గోడలు, కంచెలు ఉండటం అనవసరం. సరిహద్దు తొలగింపుతో ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని, ఉద్యోగులకు సమయం ఆదా అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి అభిప్రాయాన్ని స్థానిక వ్యాపారులు, ఉద్యోగులు కూడా వ్యక్తం చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news