ఫ్రాన్స్ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న 2027 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్) పార్టీ నాయకత్వంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీ అధ్యక్షుడు జోర్డాన్ బర్డెల్లా అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, పార్టీ ప్రముఖ నేత మెరిన్ లే పెన్ స్వయంగా తానే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో కొంతకాలంగా అధ్యక్ష అభ్యర్థిగా ఎదుగుతున్న బర్డెల్లా మరోసారి పార్టీ రెండో స్థానంలోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫ్రాన్స్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో విలేకరులు బర్డెల్లాను ఈ నిర్ణయంపై స్పందించమని కోరగా, ఆయన చాలా ప్రశాంతంగా స్పందించారు. అధ్యక్ష అభ్యర్థిగా తాను పోటీ చేయకపోవడంపై నిరాశ గానీ, ఉపశమనం గానీ లేదని స్పష్టం చేశారు. మెరిన్ లే పెన్ పార్టీకి ప్రాతినిధ్యం వహించడం తనకు ఆనందంగా ఉందని, గతంలోలాగే ఇద్దరూ కలిసి పనిచేస్తామని తెలిపారు. పార్టీ విజయమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
30 ఏళ్ల జోర్డాన్ బర్డెల్లా నేషనల్ ర్యాలీ పార్టీలో అత్యంత వేగంగా ఎదిగిన యువ నాయకుల్లో ఒకరు. యువతలో మంచి ఆదరణ పొందిన ఆయన గత కొన్నేళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. పార్టీ భవిష్యత్ అధ్యక్ష అభ్యర్థిగా కూడా ఆయన పేరు బలంగా వినిపించింది. ముఖ్యంగా మెరిన్ లే పెన్‌పై ఉన్న న్యాయపరమైన కేసుల నేపథ్యంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేకపోతే బర్డెల్లానే సహజ వారసుడిగా భావించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news