టీజీ20 లీగ్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు గురువారం అన్విత ఖమ్మం ఏసెస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజేత నేరుగా ఫైనల్‌కు చేరుకోగా, ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 ద్వారా మరో అవకాశం లభించనుంది. వరుసగా ఏడు విజయాలతో గ్రూప్ దశను పూర్తి చేసిన హైదరాబాద్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఖమ్మం కూడా కీలక పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్ విజయాల్లో కెప్టెన్ అభిరథ్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లోనే 418 పరుగులు చేసి ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలతో టోర్నీలో అత్యంత నిలకడైన బ్యాటర్‌గా నిలిచాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతున్నాడు. కెప్టెన్సీలోనూ సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటూ జట్టును సమర్థంగా ముందుండి నడిపిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో అజయ్ దేవ్ గౌడ్ 16 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేస్‌లో అగ్రస్థానంలో కొనసాగుతూ హైదరాబాద్‌కు పెద్ద బలంగా మారాడు.
హైదరాబాద్ బలం కేవలం ఇద్దరు ఆటగాళ్లకే పరిమితం కాదు. గణేశ్ గడుగు బ్యాటింగ్‌లో 224 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా, ప్రణవ్ వర్మ బ్యాటుతో పాటు బంతితోనూ ప్రభావం చూపిస్తున్నాడు. అతని ఖాతాలో ఇప్పటికే 9 వికెట్లు ఉన్నాయి. షణ్ముక్ అశ్విన్, అన్విత్ రెడ్డి, సాయి వికాస్ రెడ్డి వంటి ఆల్‌రౌండర్లు కూడా జట్టుకు అదనపు బలంగా నిలుస్తున్నారు. అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న హైదరాబాద్‌ను నిలువరించడం ఖమ్మానికి పెద్ద సవాల్ కానుంది.
అయితే నాకౌట్ మ్యాచ్‌ల్లో గత ప్రదర్శనల కంటే ఆ రోజు ఆటే కీలకం. ఖమ్మం జట్టు ఒత్తిడిని తట్టుకుని హైదరాబాద్ అజేయ ప్రస్థానానికి బ్రేక్ వేయాలని చూస్తుండగా, హైదరాబాద్ నేరుగా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. రెండు జట్లు పూర్తి స్థాయి పోరాటంతో ఆడే అవకాశం ఉండటంతో టీజీ20 లీగ్‌లో ఈ క్వాలిఫయర్-1 మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠభరితమైన క్రికెట్‌ను అందించనుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news