ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన రెండు చమురు ట్యాంకర్లపై జరిగిన క్షిపణి దాడికి ఇరాన్ బాధ్యత వహించాలని యూఏఈ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ దాడిని "దుస్సాహసపూరిత చర్య"గా అభివర్ణించిన యూఏఈ ప్రభుత్వం, అంతర్జాతీయ సముద్ర భద్రతపై ఇది తీవ్రమైన దాడి అని పేర్కొంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది.
దాడి హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు ప్రయాణిస్తున్న సమయంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గంలో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయ ఆందోళనకు కారణమైంది. దాడి అనంతరం ట్యాంకర్లకు తీవ్ర నష్టం వాటిల్లగా, గాయపడిన సిబ్బందికి తక్షణ వైద్య సహాయం అందించారు. మృతుడు భారతీయ నౌకా సిబ్బందికి చెందిన వ్యక్తి అని గతంలో యూఏఈ రక్షణ శాఖ వెల్లడించింది.
యూఏఈ ప్రభుత్వం ఈ దాడిని అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. ఇలాంటి చర్యలు ప్రపంచ ఇంధన మార్కెట్ల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని, ప్రాంతీయ భద్రతను మరింత అస్థిరంగా మారుస్తాయని హెచ్చరించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, మిత్రదేశాలతో కలిసి తదుపరి చర్యలపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.
Fetching videos...
Fetching latest news...
No trending news