భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ప్రారంభ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)గా భావిస్తున్న జియో ప్లాట్ఫార్మ్స్ ఐపీఓ వెనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ అమలు చేసిన రహస్య వ్యూహానికి ‘ప్రాజెక్ట్ జూపిటర్’ అనే అంతర్గత పేరు పెట్టినట్లు తాజాగా వెల్లడైంది. దాదాపు పది నెలలపాటు అత్యంత గోప్యంగా నిర్వహించిన ఈ
రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ గత ఏడాది వాటాదారుల సమావేశంలో జియోను 2026 తొలిార్థంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తామని ప్రకటించారు. అయితే ఆ ప్రకటనకు ముందే కంపెనీ అంతర్గతంగా ‘ప్రాజెక్ట్ జూపిటర్’ పేరుతో భారీ స్థాయి కార్యాచరణ ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం కేవలం ఐపీఓ నిర్వహించడం మాత్రమే కాకుండా, భారత మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద షేర్ విక్రయాన్ని ఎలాంటి అంతరాయాలు లేకుండా విజయవంతం చేయడం.
ప్రాజెక్ట్ జూపిటర్‌లో అత్యంత ముఖ్యమైన అంశం గోప్యత. ఈ ప్రణాళిక గురించి రిలయన్స్‌లోని కొద్దిమంది అత్యున్నత అధికారులు, ఎంపిక చేసిన పెట్టుబడి బ్యాంకర్లకు మాత్రమే సమాచారం అందుబాటులో ఉండేది. ముసాయిదా పత్రాలు, పెట్టుబడిదారుల ప్రజెంటేషన్లు, వ్యూహాత్మక పత్రాలను ఎక్కువగా ముద్రిత రూపంలోనే పంపిణీ చేశారు. ఇమెయిల్ లేదా ఇతర డిజిటల్ కమ్యూనికేషన్‌ను సాధ్యమైనంత వరకు నివారించి, సమాచారం లీక్ కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి
ప్రాజెక్ట్ ద్వారా జియోను స్టాక్ మార్కెట్లోకి తీసుకురావడానికి రిలయన్స్ పలు కీలక అడ్డంకులను అధిగమించినట్లు సమాచారం.ఈ ప్రాజెక్ట్‌కు రిలయన్స్ సీనియర్ అధికారులు నాయకత్వం వహించినట్లు సమాచారం. జియో ప్లాట్‌ఫార్మ్స్‌కు అవసరమైన ఆర్థిక, న్యాయ, నియంత్రణ సంబంధిత ఏర్పాట్లను సమన్వయం చేయడంతో పాటు, దేశీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకులతో సంప్రదింపులు జరిపారు. ప్రారంభ దశలో కొద్ది సంస్థలతో మాత్రమే పని ప్రారంభించి, తర్వాత బ్యాంకర్ల సంఖ్యను క్రమంగా పెంచారు.
జియో ఐపీఓలో పెద్ద సవాళ్లలో ఒకటి నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా షేర్‌హోల్డింగ్ నిర్మాణాన్ని రూపొందించడం. ఈ క్రమంలో మార్కెట్ నియంత్రణ సంస్థ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు రిలయన్స్‌కు అనుకూలంగా మారాయి. భారీ మార్కెట్ విలువ కలిగిన కంపెనీలకు కనీస ప్రజా వాటా నిబంధనల్లో సడలింపులు రావడంతో ఐపీఓ ప్రణాళిక వేగం అందుకుంది
Fetching videos...
Fetching latest news...
No trending news