రంగారెడ్డి జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం షాబాజ్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో సాత్విక్రెడ్డి అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. స్కూల్కు వెళ్లేందుకు బస్సు కోసం రోడ్డుపక్కన వేచి చూస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికులు విద్యార్థిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా అతడు మృతి చెందినట్లు సమాచారం.
విద్యార్థి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సంఘటన స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, స్థానికులు ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం స్కూల్ బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం ఎలా జరిగింది, డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతితో షాబాజ్ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news