తమిళ సినీ నటుడు రవి మోహన్ ఇంట్లో జరిగిన విలువైన నగలు, నగదు చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. చెన్నైలోని ఇంజంబాక్కం ప్రాంతంలో ఉన్న నటుడి నివాసంలో జరిగిన ఈ ఘటనలో ఆయన డ్రైవర్ రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా రాజేష్‌ను విచారించగా నగదు చోరీ చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కోర్టు న్యాయపరమైన కస్టడీకి పంపింది.
ఈ కేసు జూన్ 22న వెలుగులోకి వచ్చింది. రవి మోహన్ ఇంట్లో నుంచి విలువైన వజ్రాల హారం, నగదు కనిపించకపోవడంతో ఆయన తరఫున మేనేజర్ నీలంకరై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో పనిచేసే సిబ్బంది, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను ఒక్కొక్కరిని విచారించారు. ఈ విచారణలో అనుమానాలు డ్రైవర్ రాజేష్‌పై కేంద్రీకృతమయ్యాయి.
పోలీసుల విచారణలో రాజేష్ తన వద్ద ఉన్న తాళాలను ఉపయోగించి ఇంట్లోని లాకర్‌ను తెరిచి నగదు తీసుకున్నట్లు అంగీకరించినట్లు సమాచారం. అతడి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని తిరిగి రవి మోహన్‌కు అప్పగించారు. అయితే కేసులో ప్రస్తావనకు వచ్చిన సుమారు రూ.10 లక్షల విలువైన వజ్రాల హారం ఇంకా లభించలేదు. ఆ హారం ఎక్కడికి వెళ్లింది, దానిని విక్రయించారా లేదా మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
Fetching videos...
Fetching latest news...
No trending news