తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రస్తుత కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ పేరును మారుస్తూ కొత్తగా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్’ (శక్తి)గా ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాలను మరింత బలోపేతం చేయడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
ఈ కొత్త శాఖ పరిధిలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని కూడా బదిలీ చేసినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న ఈ యూనివర్సిటీని ఇకపై ‘శక్తి’ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ఒకే వ్యవస్థలో సమన్వయం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలలను కూడా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడం ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
Fetching videos...
Fetching latest news...
No trending news