ఆంధ్రప్రదేశ్ ఉక్కు రాష్ట్రంగా అవతరిస్తోందని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా హామీలు, శంకుస్థాపనలకే పరిమితమైన కడప స్టీల్ ప్లాంట్ పనులను ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రారంభించడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి శుభపరిణామమని వారు పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని అభిప్రాయపడ్డారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాయలసీమ ఉక్కు కర్మాగారానికి పునాది రాయి వేయడం చారిత్రాత్మక ఘట్టమని వారు హర్షం వ్యక్తం చేశారు. సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో రూ.16,350 కోట్ల పెట్టుబడితో ప్రపంచస్థాయి సమగ్ర ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం రాష్ట్ర పారిశ్రామిక శక్తిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.
ఈ ప్రాజెక్టుతో పాటు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం మరియు సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు కావడం ద్వారా సుమారు 2,700కి పైగా ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. దీంతో వేలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించనుందని వారు అభిప్రాయపడ్డారు.
రాయలసీమ ప్రాంతం ఇకపై కరువు నేలగా కాకుండా అభివృద్ధి కేంద్రంగా మారుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కియా కార్లు, హీరో బైక్‌లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి పరిశ్రమలతో ఈ ప్రాంతం కొత్త పారిశ్రామిక హబ్‌గా ఎదుగుతుందని తెలిపారు. ఈ అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news