విజయవాడ: బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రిటైర్మెంట్ అయిన రెండు నెలలకే బాలసుబ్రహ్మణ్యం మనందరికీ దూరం కావడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.
బాలసుబ్రహ్మణ్యం సమర్థతపై తనకు ఎనలేని విశ్వాసం ఉండేదని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రభుత్వ సేవల్లో అందించిన కృషిని ప్రస్తావించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ సర్వీసులో పోలీసు శాఖతో పాటు ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో విభిన్న బాధ్యతలు నిర్వహించి సేవలందించారని తెలిపారు.
పదవీ విరమణ అనంతరం కొద్ది కాలానికే ఆయన మరణించడం విచారకరమని సీఎం పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news