పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మురసు తుపాను తీవ్ర తుపానుగా మారింది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తా తీరం వైపు కదులుతోంది. తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.
నేటి అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో మురసు తుపాను తీరం దాటే అవకాశం ఉందని తాజా సమాచారం సూచిస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 160 కిలోమీటర్లు, చెన్నైకి 180 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది.
తుపాను తీరం దాటే సమయంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల సూచనలు, వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనించాలని సూచిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news