మురసు తుపాను నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
తుపాను సమయంలో రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతే వెంటనే తొలగించేందుకు అవసరమైన సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తుపాను తీవ్రత, దాని ప్రభావంపై ప్రజలకు ముందుగానే సమాచారం అందించి అప్రమత్తం చేయాలని మంత్రి నారాయణ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా మున్సిపల్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news