మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 11న తన కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నడిపిస్తామని, ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.
తనతో పాటు ఓవీ రమణ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.
తన కొత్త పార్టీకి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. పార్టీ పేరు ప్రకటనతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news