ఢిల్లీ: భారత నావికాదళాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.53,866 కోట్ల విలువైన భారీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎనిమిది కొత్త తరం యుద్ధ నౌకల నిర్మాణానికి రక్షణ శాఖ ఒప్పందాలు చేసుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ ఐదు యుద్ధ నౌకలను నిర్మించనుంది. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు మరో మూడు యుద్ధ నౌకల తయారీ బాధ్యతలు అప్పగించారు.
ఈ యుద్ధ నౌకలను పూర్తిగా స్వదేశీ డిజైన్, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. దేశీయ రక్షణ రంగ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు భారత నావికాదళానికి ఆధునిక యుద్ధ నౌకలను అందుబాటులోకి తీసుకురావడం ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యంగా ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news