మురసు తుపాను ప్రభావం నేపథ్యంలో బాపట్ల జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాలతో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు.
తుపాను ప్రభావంతో విద్యార్థులు, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు, సముద్ర తీరంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సూర్యలంక బీచ్‌ను తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పర్యాటకులు బీచ్‌కు వెళ్లకుండా అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news