మురసు తుపాను తీవ్రత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ఓడరేవుల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో పోర్టుల్లో అప్రమత్తత చర్యలు చేపట్టారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
నిజాంపట్నం పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మచిలీపట్నం పోర్టులో 9వ నంబర్, కృష్ణపట్నం పోర్టులో 8వ నంబర్ ప్రమాద హెచ్చరికలు ప్రకటించారు.
రాష్ట్రంలోని మిగిలిన ప్రధాన పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, పోర్టు అధికారులు జారీ చేసే సూచనలను అనుసరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news