మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే జైలులో ఉన్న ఈశ్వర్‌ను రెండు రోజుల పాటు విచారించేందుకు నాంపల్లిలోని ఈడీ కోర్టు అనుమతి ఇచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు ఈశ్వర్‌ను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశాలపై ఆయనను ప్రశ్నించనున్నారు.
ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న రాజ్ కేసిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నట్లు సమాచారం. ఈడీ విచారణలో వెలుగుచూసే అంశాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news