అమరావతి: రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపిన వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరింది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిటిషన్‌ను రేపు విచారించనున్నట్లు హైకోర్టు తెలిపింది.
కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్, సీసీటీవీ రికార్డులు, వైద్య నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అలాగే హేమంత్ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్‌తో పాటు మరో తొమ్మిది మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, సంబంధిత ఆధారాలు చెదిరిపోకుండా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు.
Fetching videos...
Fetching latest news...
No trending news