ఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి వెల్లడించారు.
ఛార్జ్‌షీట్ దాఖలైన నేపథ్యంలో పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విరాళాల కేసులో చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది.
మరోవైపు, రామమందిర నిర్మాణ స్థలానికి సంబంధించిన సరిహద్దులను పునఃపరిశీలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో విరాళాల కేసుకు సంబంధించిన పిటిషన్ల విచారణకు ముగింపు పలికింది.
Fetching videos...
Fetching latest news...
No trending news