మురసు తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను గుర్తించి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వాగులు, వంకల సమీపంలో ప్రజలు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
తుపాను కారణంగా తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వాటిని వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news