మురసు తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే, 48 గంటల్లో పునరుద్ధరించే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైతే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. తుపాను తీవ్రత అధికంగా ఉండే జిల్లాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని విద్యుత్ సంస్థల సీఎండీలకు సూచించారు.
విద్యుత్ సరఫరా సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా 1912 కాల్ సెంటర్ను 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలని గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. తుపాను సమయంలో ప్రజలకు విద్యుత్ సేవల్లో అంతరాయం తగ్గించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news