విజయనగరం పార్లమెంట్ ఉపాధ్యక్షుడు, వంగర మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బొత్స వాసుదేవరావునాయుడు రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లుకు చట్టబద్ధ ఆమోదం లభించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. అమరావతి విషయంలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ బిల్లుకు సహకరించిన ఎంపీలు, ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందని, పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కిన గౌరవమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
స్వర్ణాంధ్ర నిర్మాణంలో అమరావతి ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. బిల్లు ఆమోదంతో అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు ముగింపు లభించిందని చెప్పారు. రైతుల త్యాగాలకు, ప్రజల ఆకాంక్షలకు ఇది గౌరవమని పేర్కొంటూ, గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని రాజధాని లేకుండా ఉంచారని ఆయన విమర్శించారు. బిల్లు ఆమోదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారని ఆయన వివరించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news