పాతపట్నం నియోజకవర్గంలో అమరావతిని ఏకైక రాజధానిగా బిల్లు అమలైన సందర్భంగా గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ముగ్గులు వేసి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు, ప్రతి ఇంటి గడప ముందు రంగురంగుల ముగ్గులు వేసి పండుగ వాతావరణం సృష్టించాలని ఆయన పిలుపునిచ్చారు. ముగ్గులు కేవలం అలంకరణకే కాకుండా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అమరావతి రాజధానిపై ప్రజల నిబద్ధత, ఐక్యత స్పష్టంగా కనిపించేలా ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యం చూపాలని తెలిపారు. అమరావతి స్ఫూర్తిని, అభివృద్ధి పట్ల ఆకాంక్షను, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై కృతజ్ఞతను ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తం చేయాలని పేర్కొన్నారు.
ప్రతి కుటుంబం ఈ కార్యక్రమాన్ని పండుగలా భావించి గడప ముందు ముగ్గులు వేసి ఆనందాన్ని పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కూడా పాల్గొని తమ మద్దతు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news