విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి 46 సంవత్సరాలు పూర్తిచేసుకుని 47వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షులు P.V.N. మాధవ్ మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మతం, కులం, భాష, ప్రాంతం పేరుతో వైషమ్యాలు లేకుండా “ఒకటే దేశం, ఒకటే ప్రజ, ఒకటే చట్టం” అనే నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
దేశ సమగ్ర అభివృద్ధి, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడమే బీజేపీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. “వికసిత భారత్” సాధన కోసం ప్రతి కార్యకర్త, ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పార్టీ గత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, భవిష్యత్తులో మరింత బలంగా ప్రజల మధ్య పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. వేడుకల సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ, ప్రసంగాలు, శుభాకాంక్షలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
Fetching videos...
Fetching latest news...
No trending news