ఎల్పీజీ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. వినియోగదారులకు అందుబాటులో 5 కిలోల సిలిండర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ప్రజలు ఎల్పీజీ సరఫరా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని, అవసరమైనంత మేరకు వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. చిన్న పరిమాణం గల 5 కిలోల సిలిండర్ల ద్వారా గృహ వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించనున్నట్లు తెలిపింది.
అలాగే బ్లాక్లో ఎల్పీజీ సిలిండర్లను అమ్మే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. వినియోగదారులను మోసం చేసే లేదా అధిక ధరలకు అమ్మే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
ఎల్పీజీ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వినియోగదారులు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే గ్యాస్ సిలిండర్లను పొందాలని సూచించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news