నీటి భద్రత మరియు సాగునీటి సంఘాల బాధ్యతలో భాగంగా చెన్నేకొత్తపల్లి మండల కూటమి నాయకులు, కార్యకర్తలకు రేపు నిర్వహించనున్న కార్యక్రమంపై సమాచారం అందించారు. 06.04.2026 సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు కనుముక్కల గ్రామం వద్ద చెరువుల పునరుద్ధరణ పనులకు లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన చెరువులను సందర్శించి వాటి ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, పూడికతీత మరియు కాల్వల అనుసంధానం కోసం అవసరమైన ప్రణాళికలపై అధికారులతో చర్చించనున్నారు.
అనంతరం 3.30 గంటలకు వెల్దుర్తి గ్రామానికి చేరుకుని, వెల్దుర్తి నుండి యర్రొన్నిపల్లి గ్రామం వరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాప్తాడు నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు పరిటాల సునీతమ్మ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news