నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం భానుకచర్ల గ్రామంలో “మీ భూమి - మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా క్యూఆర్ కోడ్ మరియు ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసిందని తెలిపారు. పాత ప్రభుత్వం సమయంలో పట్టాదారు పాస్ పుస్తకాలపై ఉన్న అంశాలపై రైతులు ఆందోళనకు గురయ్యారని, భూమి భద్రతపై అనుమానాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతుల విశ్వాసాన్ని పెంచేందుకు రాజముద్రతో కూడిన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పాస్ పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు.
లిటిగేషన్ భూముల క్రమబద్ధీకరణ, భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుని కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్ర రెడ్డి, మండల కన్వీనర్లు, సొసైటీ చైర్మన్ గోవిందు, ఇతర నాయకులు, అధికారులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news