కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన పోలీసులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి, గాయపడిన పోలీసులకు ధైర్యం చెప్పి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చల్లపల్లి పరిధిలో అనుమతులు లేకుండా క్రాకర్స్ విక్రయిస్తున్న దుకాణాల నుంచి సీజ్ చేసిన పేలుడు పదార్థాలను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని మంత్రి తెలిపారు. ఈ ఘటనలో ఎస్సై, కోర్ట్ కానిస్టేబుల్ మరియు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారని వెల్లడించారు.
అబ్దుల్లా అనే కానిస్టేబుల్కు 50–60 శాతం గాయాలున్నాయని, మిగతా వారికి ప్రాణాపాయం లేదని తెలిపారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. గాయపడిన పోలీసులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి అనిత హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news