సిద్ధవటం మండలం మాధవరం-1 పంచాయతీ యస్.కె.ఆర్ నగర్లో సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చేనేత క్లస్టర్ భవనం స్థానిక కార్మికులకు ఉపయోగపడటం లేదని చేనేత సొసైటీ అధ్యక్షుడు గంజి సుబ్బరాయుడు విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, ఏడాది క్రితం ప్రభుత్వం 40 నుండి 50 లక్షల రూపాయలతో ఈ భవనాన్ని ఆధునీకరించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులకు లీజుకు ఇచ్చారని ఆరోపించారు.
లీజుకు తీసుకున్న వ్యక్తి చేనేత కార్మికులకు శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తి వృథా అవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు ఈ విషయంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూతన టెక్నాలజీ, ఆధునిక డిజైన్లు, డైయింగ్ రంగాల్లో స్థానిక కార్మికులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
ఈ భవనం సామాన్య చేనేత కార్మికుల ఉపాధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దీనిపై స్పందించిన అధికారులు, ఏడీ సెలవులో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చాక క్లస్టర్‌ను సందర్శించి విచారణ చేసి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news