పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పాలకొండ, పార్వతీపురం, బొబ్బిలి పురపాలకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబినాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు పట్టణ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా, ప్రధాన మార్కెట్ రోడ్ల విస్తరణ, రాణీ మల్లమ్మదేవి పార్క్ అభివృద్ధి, శివార్ల కాలనీలకు మౌలిక వసతులు వంటి అంశాలను ప్రస్తావించారు.
మంత్రి నారాయణ బొబ్బిలి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రతి పట్టణంలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. సువర్ణముఖీ నది నుంచి త్రాగునీటి సరఫరా కోసం రూ.123.9 కోట్లతో పనులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే వ్యర్థాల నిర్వహణ ద్వారా సంపద సృష్టి కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే బేబినాయన అభ్యర్థన మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి అమ్మవారి గుడి వరకు రోడ్డు అభివృద్ధికి రూ.2 కోట్లు, శివారు కాలనీల అభివృద్ధికి రూ.1 కోటి, రాణీ మల్లమ్మదేవి పార్కు అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల అభివృద్ధి, టిడ్కో గృహాల పంపిణీపై కూడా కీలక ప్రకటనలు చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news