నారా లోకేష్‌కు సింధనూరులో అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. కర్ణాటక పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్న యువనేతకు స్థానిక పార్టీ నాయకులు, తెలుగు సంఘాలు, అభిమానులు, తెలుగు యువత, స్థానిక తెలుగు ప్రజానీకం పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు.
దారిపొడవునా అభిమానులు పూలతో స్వాగతం పలుకుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. యువగళం జెండాలు చేతబూని “జై లోకేష్” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
పీడబ్ల్యూయూడీ క్యాంప్ వద్ద కూడా తెలుగు యువత గజమాలతో నారా లోకేష్‌ను స్వాగతించింది. అక్కడి అభిమానులతో ఆయన కొంతసేపు గడిపి, వారితో ఆత్మీయంగా మాట్లాడి ఫోటోలు దిగారు. ఈ స్వాగత కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
సింధనూరులో జరిగిన ఈ స్వాగతం తెలుగు ప్రజల ఐక్యతను, అభిమానాన్ని ప్రతిబింబించింది. స్థానికంగా తెలుగు సంఘాల ఉత్సాహం, యువత స్పందన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Fetching videos...
Fetching latest news...
No trending news