పోలవరం జిల్లా పరిధిలోని దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పాత నాగలపల్లి, పూడిపల్లి పరిసర ప్రాంతాల్లో పులి కనిపించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
సమాచారం ప్రకారం, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో పెద్దపులి కనిపించింది. అధికారులను గమనించిన పులి వెంటనే వెనక్కు వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది.
అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, గ్రామస్థులకు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పులి కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పరిసర గ్రామాల ప్రజలు ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచనలు అందుతున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news