ఇరాన్‌లోని మినాబ్ ప్రాంతంలో బాలికల పాఠశాలపై జరిగిన ఘోర క్షిపణి దాడిలో వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు Donald Trump స్పందించారు. ఈ దాడిలో అమెరికా పాత్ర ఉందన్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ, "అది మేము చేశామని నేను అనుకోవడం లేదు" అని వ్యాఖ్యానించారు. దాడికి అసలు బాధ్యులు ఎవరో ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదని, యుద్ధ పరిస్థితుల్లో అనేక దిశల నుంచి క్షిపణులు ప్రయాణిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు అయితే ఈ ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తులో అమెరికా సైనిక బలగాల పాత్ర ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు సూచించాయని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పాత లక్ష్య సమాచారాన్ని ఉపయోగించడం వల్ల ఈ విషాదం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా రక్షణ శాఖ దర్యాప్తును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు తుది నివేదిక విడుదల కాలేదు. ఈ ఘటనలో 175 మందికి పైగా చిన్నారులు, ఉపాధ్యాయులు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం ఈ దాడిని అత్యంత భయానక ఘటనగా అభివర్ణించి పారదర్శక దర్యాప్తు జరపాలని కోరింది. ఘటనకు సంబంధించిన నిజాలు వెలుగులోకి రావాలని బాధిత కుటుంబాలు, మానవ హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news