వీరులపాడు మండల మహిళా సమైఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు కోట్ల రూపాయల చెక్కులను కూటమి నేతలతో కలిసి అందజేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వివిధ పథకాల ద్వారా మహిళా సంఘాలను బలోపేతం చేస్తోందని ఆమె పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుని తమ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలని సూచించారు.
వీరులపాడు మండలంలో 1257 గ్రూపులు, 40 గ్రామ సంఘాలు క్రియాశీలంగా పనిచేస్తున్నాయని తెలిపారు. పిఓపీ పథకం, స్త్రీ నిధి పథకం, సిఐఎఫ్ పథకం, బ్యాంక్ లింకేజి వంటి పథకాల కింద భారీ స్థాయిలో రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. పిఓపీ పథకం కింద 375 మంది సభ్యులకు రూ.1.82 కోట్లకు పైగా, స్త్రీ నిధి పథకం ద్వారా 990 మందికి రూ.6.66 కోట్ల సహాయం, సిఐఎఫ్ పథకం కింద రూ.50 లక్షలు, బ్యాంక్ లింకేజి ద్వారా 245 గ్రూపులకు రూ.33.99 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం మహిళా సంఘాల అభివృద్ధికి దోహదపడేలా నిర్వహించబడింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news