విశాఖపట్నంలో విశాఖ సాహితీ సంస్థ 56వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ద్వారకానగర్ గాయత్రి విద్యా పరిషత్ మందిరం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉభయ రాష్ట్రాల ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం కవులు, కళాకారులకు పుట్టినిల్లు అని విశ్రాంత ఐఏఎస్ అధికారి వైవి అనురాధ పేర్కొన్నారు. సాహిత్య రంగానికి విశాఖ సాహితీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆమె అభిప్రాయపడ్డారు.
తెలంగాణ తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య నిత్యానందరావు మాట్లాడుతూ విశాఖ సాహితీ కార్యక్రమాలు ప్రశంసనీయం అని పేర్కొన్నారు. తెలంగాణ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకురాలు ఆచార్య విజయలక్ష్మి మాట్లాడుతూ 56 ఏళ్లుగా నిరంతరంగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం సాహసోపేతమని అభివర్ణించారు. బీజేపీ నాయకులు చెరువు రామకోటయ్య మాట్లాడుతూ సంస్థకు సొంత భవనం అవసరమని సూచించారు.
ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు, ఉపాధ్యక్షులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, రచయితలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. అతిథుల చేతుల మీదుగా పలువురిని సత్కరించారు. ఈ కార్యక్రమం సాహిత్య రంగానికి ప్రోత్సాహం కలిగించే వేదికగా నిలిచింది.
Fetching videos...
Fetching latest news...
No trending news