HomeNationalపల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్కు చెందిన..
పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్కు చెందిన నలుగురు మృతి
Updated 4 days ago
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన తుఫాను వాహనం ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యుడి మరణంతో అంత్యక్రియల కోసం హైదరాబాద్ నుంచి పామూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లారీని ఢీకొన్న ప్రభావంతో తుఫాను వాహనం పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.