మురసు తుపాను నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావం, వర్షాల కారణంగా జలాశయాలు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఇరిగేషన్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఆయా జిల్లాల్లోని రిజర్వాయర్లలోకి వచ్చే నీటి ప్రవాహాలను నిరంతరం గమనించాలని సూచించారు. నీటి నిల్వలు, ప్రవాహాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
తుపాను ప్రభావంతో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. મురసు తుపాను నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news