శ్రీకాళహస్తిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను తిరుపతి పార్లమెంట్ నాయి బ్రాహ్మణ సాధికార సమితి సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఫెడరేషన్ నిధులు విడుదల, ఆధునిక సెలూన్ షాపులకు సబ్సిడీలు, 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్, కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు వంటి అంశాలపై వినతిపత్రం సమర్పించారు. సమాజాభివృద్ధికి సంబంధించిన ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న కోట చంద్రశేఖర్‌ను ఆయన అభినందించారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news